మాసశివరాత్రిపూజలు

img

మాసశివరాత్రి


ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిథిని
#మాసశివరాత్రి గా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాసశివరాత్రి.
మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి?
మహాశివుడు లయ కారకుడు లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.
చంద్రోమా మనస్సో జాతః అనే సిద్ధాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది. ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. మనం గమనిసే అమావాస్య తిథి ముందు ముడియాలలో కొందరి ఆరోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంతమేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది.
మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలంటే
అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్య మైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు. అలాగే ఈ రోజు శివాలయములో పూజలో పెట్టిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా ఆరోజు ప్రదోషవేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది.

సర్వేజనా సుఖినో భవంతు

ది 21-02-2020 మాసశివరాత్రి సందర్బంగా ఈ క్రింది పూజాకార్యక్రమములు జరుపబడినవి.
ఉ॥9:30 నుండి గణపతిపూజ,పుణ్యాహం, పంచగవ్యప్రాశనం,
మహాన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకం,
అమ్మవారికికుంకుమపూజ
సాయంత్రం 3.00 గంటలకు రుద్రహోమము జరుపబడినది,
స్వామి అమ్మవార్లకు విశేషఅలంకరణలు,
సా॥6గం.లక్ష దీపర్చన అనంతరం మహానివేదన,హారతి,మంత్రపుష్పం,తీర్దప్రసాదవితరణ జరుపబడినవి.
ఆలయ ఆభివ్రుథ్థి కమిటి వారు సాయంత్రం 7 గంటలనుండి 11 గంటల వరకు అన్నదాన కార్యక్రమము నిర్వహించిరి.